Type Here to Get Search Results !

ఆర్టీఈ చట్టం 12(1) సి ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల మొదటి విడత లాటరీ ఫలితాలు

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్ష* 

 పత్రికా ప్రకటన (25.03.2026) *


ఆర్టీఈ చట్టం 12(1) సి ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదల* 

 మొదటి విడత లాటరీలో 30,075 మందికి సీట్లు కేటాయింపు వెల్లడించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాల తుది జాబితా బుధవారం (25.03.2026) విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు ఒక ప్రకటనలో తెలిపారు. 



 రాష్ట్ర వ్యాప్తంగా 54,647 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 54,016 మంది అర్హులుగా పరిగణించామని, మొదటి విడత లాటరీలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న 30,075 మంది విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడంతో పాటు, https://cse.ap.gov.in/ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు. పాఠశాలలకు కేటాయించిన విద్యార్థులు విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్, ఆదాయ, కుల, విద్యార్థి పుట్టిన రోజు ద్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, తోబుట్టువుల ఆధార్, స్టడీ సర్టిఫికేట్ తదితర ద్రువీకరణ పత్రాలతో 26.03.2026 నుండి 07.04.2026 లోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలను నిర్ధారించుకోవచ్చు. 



పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించవచ్చు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులకు రెండో విడత లాటరీ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేస్తామన్నారు. సంబంధిత పాఠశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అడ్మిషన్లు ఇవ్వాలని తెలిపారు. సరైన కారణం లేకుండా పాఠశాల యాజమాన్యాలు అడ్మిషన్లు నిరాకరిస్తే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అడ్మిషన్లను సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీలు)కు ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్ల ద్వారా నిర్ధారిస్తారు. పాఠశాల యాజమాన్యాలకు సందేహాలు ఉంటే సంబంధిత ఎంఈవో, డీఈవో, ఆర్జేడీలను సంప్రదించాలన్నారు. 




CHECK RTE LOTTERY RESULTS

Disclaimer

This information is provided for informational and educational purposes only.

  • We are not responsible for any errors or mistakes in the information.
  • We are not responsible for lottery results or admission selection.
  • We are not responsible for any technical issues on the official website.
  • We are not responsible for any loss or decisions taken based on this information.
  • This is not an official government website or notification.

Users are advised to visit the official website and verify details before taking any action.

This content is for information only and use at your own responsibility.


❓ FAQs

1. Where can I check AP RTE Lottery Results?

You can check the results on the official website: https://cse.ap.gov.in/

2. When were RTE lottery results released?

The first phase lottery results were released on 25 March 2026.

3. How will selected students be informed?

Selected students will receive SMS to parent mobile numbers.

4. What is the admission confirmation date?

Admissions must be confirmed from 26 March to 07 April 2026.

5. Is there any helpline number?

Yes, Toll Free: 18004258599

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.